ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఇద్దరూ విద్యార్థులు గల్లంతయ్యారు. ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం సముద్రంలోకి స్నానానికి 12 మంది విద్యార్థులు దిగారు. అందులో.. తుర్ల అర్జున్, బంగా బబ్లు గల్లంతయ్యారు. మిగతా పది మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం మెరైన్, ఎస్ రాయవరం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
గజ ఈతగాళ్లు.. స్థానిక మత్స్య కారులు సహకారంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కొరుప్రోలో ఒక వివాహానికి హాజరై ఈరోజు స్నానాల కోసమని రేపు పోలవరం సముద్ర తీరానికి వచ్చారు. స్నానానికి సముద్రంలో దిగగా కెరటాలు తాకిడికీ గల్లంతయ్యారు.