రైతులంటే మీకెందుకంత అలుసు.. దీపావళికి కూడా వారిని దివాళా తీయిస్తారా? : కేటీఆర్

-

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తూర్పారబట్టారు. ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని రేవంత్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ధాన్యం కోనుగోలు చేయకుండా రైతులను దసరాకే కాదు.. దీపావళికి కూడా దివాళా తీయిస్తారా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం మూలుగుతున్నా.. ధాన్యం కొనాలని అధికారులకు ఆదేశాలు అందవాయే.. ప్రభుత్వానికి రైతుల గోస పట్టదాయే? అని మండిపడ్డారు.

రాజకీయాలపై పెట్టిన దృష్టి.. ధాన్యం కొనుగోలుపై ఎందుకు పెట్టరు? రైతులంటే ఎందుకంత అలుసు? అని నిలదీశారు.మీ గారడీ హామీలను రైతులు విశ్వసించి మోసపోతున్నందుకా? అర్ధించడం తప్ప అక్రోషించడం తెలియని అమాయకులైనందుకా? అని విమర్శించారు. రాజకీయాల్లో రాక్షస క్రీడలను మానేసి..రైతులను ఆదుకోవడంపై దృష్టి కేంద్రీకరించండని..దయచేసి రైతుల విషయంలో రాజకీయాలు చేయకండని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news