పబ్‌లకు పర్మిషన్స్ కఠినతరం చేయండి : హైకోర్టు సంచలన ఆదేశాలు

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పబ్ కల్చర్ మితిమీరుతోంది. పబ్ కల్చర్కు అలవాటు పడిన యువత మద్యానికి, మత్తుకు బానిసలై ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్లపై నానా రభసా చేస్తున్నారు. అంతేకాకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీనంతటికి సెలబ్రిటీలు, వీఐపీల పిల్లలు కారణమని తేలింది.

తాజాగా సెలబ్రిటీలు, వీఐపీల పిల్లలను ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. జూబ్లీహిల్స్ పరిధిలో పబ్‌లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయని గుర్తుచేసింది. మితిమీరిన వేగంతో యువత వాహనాలు నడపడం వల్ల రోడ్ నెం.12, రోడ్ నెం.36లో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉందని కోర్టు సీరియస్ అయ్యింది. ఇకపై పబ్‌లకు నిబంధనలు మరింత కఠినతరం చేయాలని, పోలీసులు నిత్యం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని హైకోర్టు ధర్మాసనం అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది.కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news