ఏపీలో ఏ ప్రాజెక్టుకు వెళ్ళినా విధ్వంసమే క‌నిపిస్తోంది : మంత్రి నిమ్మ‌ల

-

2014-19 మధ్య టీడీపీ పాల‌న‌లో వెలిగొండ ప్రాజెక్టుకు 1373 కోట్లు కేటాయించి 96శాతం ఖ‌ర్చు చేశాం. కానీ గ‌త ఐదేళ్ళలో జ‌గ‌న్ పాల‌న‌లో 3518 కోట్ల బ‌డ్జెట్ కేటాయించి కేవ‌లం 170 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేశారు. ట‌న్నెల్స్, ఫీడ‌ర్ కెనాల్, రిజర్వాయర్ ప‌నులు , నిర్వాసితులకు 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా.. ఒక రూపాయు కూడా ఇవ్వకుండానే ఎన్నికల ముందు వెలిగొండను జాతికి అంకితం చేయటం జగన్ మార్క్ మోసం. రెండో ట‌న్నెల్ లో త‌వ్విన రెండు ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల మ‌ట్టిని మొద‌టి ట‌న్నెల్ చివ‌ర భాగాన పోశారు. మ‌ట్టిని తొల‌గించ‌కుండా నీరు వ‌ద‌ల‌డం సాధ్యం అవుతుందా. రెండో ట‌న్నెల్ 12వ కిలో మీట‌ర్ వద్ద మూడేళ్ళ క్రిత‌మే ట‌న్నెల్ బోరింగ్ మెషిన్ పాడైతేన్ఎందుకు బ‌య‌ట‌కు తీయ‌లేక‌పోయారు. టిబిఎం మెషిన్ బ‌య‌ట‌కు తీయ‌కుండా నీళ్ళు ఇవ్వ‌డం సాధ్య‌మేనా. రెండు ట‌న్నెల్స్ నుండి 11,500 క్యూసెక్కుల నీరు త‌ర‌లించాల్సి ఉండ‌గా.. క‌నీసం 10 క్యూసెక్కుల నీరు కూడా తీసుకెళ్ళ‌లేని ప‌రిస్దితి వచ్చింది.

53 టిఎంసిల సామ‌ర్ద్యం ఉన్న న‌ల్ల‌మ‌ల‌సాగ‌ర్ లో క‌నీసం అర‌ టిఎంసి నీరు కూడా నిల్వ చేయ‌లేని ప‌రిస్దితి ఉంది. ఏపీలో ఏ ప్రాజెక్టుకు వెళ్ళినా జ‌గ‌న్ మోహాన్ రెడ్డి విధ్వంసమే క‌నిపిస్తోంది. క‌డ‌ప జిల్లాకు చెందిన త‌మ అనుచ‌రుడికి వెలిగొండ హెడ్ రెగ్యులేట‌ర్ ప‌నులు అప్ప‌గించారు. ప‌నులు పూర్తి చేయ‌కుండానే ఆయన నిధులు తీసుకుని వెళ్ళిపోయారు. 2024 మార్చిలో ప్రాజెక్టుకు భూమిలిచ్చిన రైతుల‌కు నోటీసులు ఇచ్చి స‌భ‌కు రాకుండా అడ్డ‌కున్నారు. రెండు ద‌శ‌ల్లో వెలిగొండ ప్రాజెక్టును వెనువెంటనే పూర్తి చేయాల‌ని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు సూచించారు అని మంత్రి నిమ్మ‌ల పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news