విద్యార్థులకు ఉచిత సైకిళ్ళు పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి..!

-

ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం లో పిఎస్ఆర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అక్కడ ఆయన మాట్లాడుతూ.. కష్టపడకుండా ఏదీ రాదు, వచ్చినా నిలబడదు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. తల్లిదండ్రుల కోరిక తీర్చాల్సిన బాధ్యత మీమీద ఉంది. విద్యకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. కార్పొరేట్ స్థాయి చదువుని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం. రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్దితో పని చేస్తుంది. ఇటీవలే 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించింది.

రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న విద్యకి,వైద్యానికి పెద్ద పీట వేసింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించుకున్నాం. మీరే పది మందికి ఉపాధి కల్పించే విధంగా మీలో ఉన్న స్కిల్ ను బయటకు తీయాలి. ప్రతి మండలం లో ఓ పాఠశాల ను మోడల్ గా తీర్చి దిద్దేందుకు రెండు లక్షలు ఇస్తాం. త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో సొంత ఖర్చుతో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. మీ తల్లిదండ్రులు నన్ను దీవించి ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసే అవకాశం కల్పించారు. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రతి ప్రభుత్వ పాఠశాల్లో 200 మంది విద్యార్థులు ఉండే విధంగా ఉపాద్యాయులు చర్యలు చేపట్టాలి. పిల్లల తల్లిదండ్రులకు ఉపాద్యాయులు నమ్మకం కల్పించాలి అని మంత్రి పొంగులేటి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news