రాష్ట్రంలో త్వరలో మంచి మైనింగ్ పాలసీ తీసుకువస్తాం.జగన్మోహన్ రెడ్డి హయాంలో బాధిలుగా ఉన్న స్టోన్ క్రషర్స్, మిల్లర్స్ నిర్వహకులతో సమావేశం నిర్వహించము. గత మైనింగ్ మంత్రి రాష్ట్రంలోని బెదిరింపులకు పాల్పడి మైనింగ్ ను పూర్తిగా అస్తగతం చేసుకున్నారు అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. లొంగనివారిపై అధికారులను పంపించి అక్రమంగా కేసులు పెట్టాము. వైసీపీ ప్రభుత్వంలో అనేకమంది క్వారీలు నిర్వహించలేక మూసేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి, పెదిరెడ్డి కలసి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారు. ఉత్తరాంద్ర జిల్లాలకు చెందిన స్టోన్ క్రషర్స్, మిల్లర్స్ సమస్యలు మా దృష్టికి తీసుకువచ్చారు అని తెలిపారు.
ఇక గడిచిన ఐదేళ్లలో ఇసుక లో అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో భవననిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింది. సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ను అమలు చేశారు.రాష్ట్రంలో సినారేజ్ చార్జీలు లేకుండా ఇసుక అందిస్తున్నాము. విశాఖ లో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నాం. నాతవరం మండలంలో సారుగుడు, సుందరకోట పంచాయితీ లలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన లాటరైట్ త్రవ్వకాలపై విచారణ జరుగుతుంది. ఈ వ్యవహారంలో కొందరు మంత్రులపై పిర్యాదులు వచ్చాయి. విచారణ తరువాత చర్యలు తీసుకుంటాము. ఇక ఇసుకలో అక్రమాలకు పాల్పడితే పిడి యాక్ట్ నమోదు చేస్తాం అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.