తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత పదేళ్ల విధ్వంసపు పాలనలో చీకట్లు తొలగిపోయాయని.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ప్రజా పాలనలో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను రాష్ట్రం లోని ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని తెలిపారు. ఈ దీపాల కాంతులతో ప్రతీ ఇంటింటా సుఖ, సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావరణానికి హాని కలిగించకుండా చిన్నా, పెద్దలందరూ పండుగ జరుపుకోవాలని.. ప్రమాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.