దీపావళి ట్రేడింగ్ ముహూర్తం అంటే ఏంటి..? స్టాక్స్ కొనొచ్చా..?

-

ఈ దీపావళి ముహూర్త ట్రేడింగ్ 2024 ప్రారంభం అవ్వబోతోంది. ఒక గంట ట్రేడింగ్ సెషన్ నవంబర్ 1, 2024న సాయంత్రం 6:15 నుంచి 7:15 దాకా జరగబోతోంది. అయితే ఇది సంపద, శ్రేయస్సు కలిగించే సమయం, భారతీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులని పెట్టడానికి మంచి అవకాశం ఇది అని చెప్పొచ్చు. దీపావళి పండుగ సందర్భంగా ముహూర్త ట్రేడింగ్ నిర్వహిస్తారు ప్రత్యేకంగా లక్ష్మీ పూజ సందర్భంగా స్టాక్ ఎక్స్చేంజిలలో నిర్వహించే ఒక ప్రత్యేక కార్యక్రమం. ఇది సాయంత్రం జరగనుంది. కేవలం గంట పాటు మాత్రమే ఉంటుంది.

పెట్టుబడికి అనుకూలంగా భావించే సమయంలో వ్యాపారులు పెట్టుబడిదారులకు అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ తో సహా ఆస్తులలో పెట్టుబడి పెడతారు. ఇలా పెట్టుబడి పెట్టడం వలన సంపద పెరుగుతుందని అవకాశాలు పెరుగుతాయని నమ్ముతారు. ప్రతి ఏటా స్టాక్ ఎక్స్చేంజ్లు ముహూర్తం ట్రేడింగ్ కోసం షెడ్యూల్ ని ఇస్తాయి.

పెట్టుబడిదారులు దీనికోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్లలోకి ఎంటర్ అవ్వాలంటే కూడా ఇది మంచి అవకాశం. ముహూర్త ట్రేడింగ్ సమయంలో చాలామంది పెట్టుబడి పెడుతూ ఉంటారు. ట్రెడింగ్ సెషన్, స్టాక్స్ ని కొనుగోలు చేయడానికి అలాగే విక్రయించడానికి అనుకూలమైన సమయం. ఈ సంవత్సరం ముహూర్త ట్రేడింగ్ కి మీరు కూడా రెడీ అవుతున్నారా..? మొత్తం స్టడీ చేసి పెట్టుబడి లక్ష్యాలని పరిగణించాలని మర్చిపోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news