విజయవాడ అర్ధరాత్రి రెచ్చిపోతున్న దొంగలు…ఇళ్లపై రాళ్లు వేసి మరీ !

-

Vijayawada midnight thieves: విజయవాడ అర్ధరాత్రి రెచ్చిపోతున్నారు దొంగలు…ఇళ్లపై రాళ్లు వేసి మరీ రచ్చ చేస్తున్నారు. విజయవాడ అయ్యప్ప నగర్ నేతాజీ రోడ్ లో బైక్స్ దొంగలింగేందుకు యత్నించారు దొంగలు. బైక్ తాళాలు రాకపోవడంతో సీట్లు ఇరగకొట్టేసి లోపల ఉన్న నగదు దొంగలించారు దుండగులు. అర్ధరాత్రి ఇళ్లపై రాళ్లు విసిరిన దొంగలు…నగదు కూడా దొంగిలిస్తున్నారు. దొంగలు హల్ చల్ చేయడంతో అయ్యప్ప నగర్ వాసులు… భయంతో గురయ్యారు.

Vijayawada midnight thieves

అయితే… పోలీసుల నిర్లక్ష్యం వల్లే దొంగలు హల్ చల్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయ్యప్ప నగర్ కాలనీవాసులు. గతంలో అనేక మార్లు దొంగతనాలు జరిగినయని నైట్ బీట్లు పెంచాలని పోలీసులు చెప్పినప్పటికీ స్పందించకపోవడంతోనే దొంగలు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయ్యప్ప నగర్ కాలనీవాసులు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి దొంగతనాలపై నిఘా పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు అయ్యప్ప నగర్ కాలనీవాసులు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని… దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news