అఖలప్రియ వర్సెస్ జగన్ అన్నట్లు రాజకీయాలు నడుస్తున్నాయి. తాజాగా నంద్యాల విజయ పాల డైరీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ విగ్రహం ప్రారంభించడానికి ఏర్పాటు చేశారు చైర్మన్ జగన్మోహన్ రెడ్డి. అయితే… ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను ఆహ్వానించలేదు డైరీ యాజమాన్యం. విగ్రహ ప్రారంభాన్ని అడ్డుకోవడానికి అఖిల ప్రియ అనుచరులు యత్నంచారు.
7 వాహనాల్లో వచ్చిన అఖిల ప్రియ అనుచరులు… విగ్రహ ప్రారంభాన్ని అడ్డుకోవడానికి యత్నంచారు. దీంతో పోలీసులు..భారీగా మోహరించారు. అటు మంత్రులు బీ.సి.జనార్దన్ రెడ్డి , ఫరూక్ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు. దీంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు డైరీ ఎం.డి.ప్రవీణ్ కుమార్. ఈ తరుణంలోనే అఖిలప్రియ అనుచరులు…వెనక్కు వెళ్లిపోయారు. ఈ తరుణంలోనే… సాదాసీదాగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించారు డైరీ ఛైర్మెన్ జగన్మోహన్ రెడ్డి. దీం తో నంద్యాల విజయ పాల డైరీ వద్ద ఉద్రిక్తత వాతావరణం చల్లబడింది.