నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తుల రద్దీ స్పష్టంగా కనిపిస్తోంది. నేటి నుండి కార్తీక మాసం ప్రారంభం కానున్న తరుణంలో రాజమండ్రిలో భక్తులతో స్థాన ఘట్టాలు కిటకిటలాడుతున్నాయి. గోదావరి నదిలో వేలాదిగా విచ్చేసి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. భక్తుల పుణ్య స్నానాలతో గోదావరి పులకిస్తోంది. పుణ్య స్నానాలు ఆచరించి గోదావరిలో కార్తీకదీపం వదులుతున్నారు మహిళలు.
భక్తుల శివనామస్మరణతో స్నాన ఘట్టాలు మారుమ్రోగుతున్నాయి. అటు భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. శివాలయాల్లో పరమేశ్వరునికి అభిషేకాలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివపార్వతుల దర్శనం కోసం శివాలయాలు వద్ద బారుల తీరిన భక్తులు.. శివయ్యను దర్శించుకుంటున్నారు. ఇక నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కానున్నతరుణంలోనే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.