కాంగ్రెస్ గ్యారంటీల అమలుకు 10 వేల రోజులు కూడా సరిపోవు – బండి సంజయ్

-

కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల అమలుకు పదివేల రోజులు కూడా సరిపోవని ఎద్దేవా చేశారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కి కౌంటర్ ఇచ్చారు. అబద్ధపు హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రధాని ఆవాస్ యోజన కింద తాము ఇల్లు నిర్మిస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూలుస్తుందని ఆరోపించారు.

శాంతిభద్రతల పర్యవేక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు బండి సంజయ్. ఆలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయి అన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని మండిపడ్డారు.

మీ అవాస్తవ హామీలు రాష్ట్రాన్ని, ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయని.. కెసిఆర్ కొత్తగా పుట్టిన బిడ్డపై ఒక లక్ష అప్పు వేసినట్లే మీరు కూడా ప్రతి తెలంగాణ వ్యక్తిపై 2.5 లక్షల అప్పులు చేస్తారని తెలిపారు. రైతు భరోసా 500, పాడి బోనస్ బోగస్ అయ్యాయని విమర్శలు చేశారు. రూ. 500 లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లో అర్హులైన లబ్ధిదారులు మిగిలిపోయారని చెప్పారు. కాలేశ్వరం తరహాలో మరో ఏటీఎం గా మూసీ నది రూపుదిద్దుకోనుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news