రాష్ట్రంలో నిధులు లేకపోయినా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం : మంత్రి కందుల దుర్గేష్

-

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామంలో గుంతలు పూడ్చె పనులను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తో కలిసి ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాళ్లలో ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలో గత ప్రభుత్వం కనీసం గుంతలు పడిన రోడ్లను బాగు చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వం రోడ్ల గురించి పట్టించుకుని ఉంటే ఇబ్బంది ఉండేది కాదని పేర్కొన్నారు. రోడ్ల పరిస్థితి పై గత ప్రభుత్వ కాలంలో అయితే వాళ్లు పోయలేదని సమాధానం చెప్పగలిగే వాళ్ళమని, ఇప్పుడు వెళ్లడానికి మాకే సిగ్గేస్తుందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.

ఇక రాష్ట్రంలో నిధులు లేకపోయినా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. నియోజకవర్గంలో రోడ్ల మరమత్తులకు 79 లక్ష రూపాయలు మంజూరయ్యాయని వెల్లడించారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని రోడ్లను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని మంత్రి దుర్గేష్, స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news