తెలంగాణలోని మాజీ సర్పంచులు అరెస్ట్ అయ్యారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాట కు పిలుపునిచ్చారు మాజీ సర్పంచ్ లు తెలంగాణలోని మాజీ సర్పంచులు. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం ఇవ్వాలని మాజీ సర్పంచ్ లు…హైదరాబాద్ కు వచ్చారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఒక హోటల్లో సమావేశమయ్యారు మాజీ సర్పంచులు.
ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. హోటల్ వద్దకు చేరుకున్నారు. మాజీ సర్పంచులను బయటికి రాకుండా కట్టడి చేసే చర్యలు తీసుకుంటున్నారు. కొంత మంది మాజీ సర్పంచులను అరెస్ట్ చేశారు.. ఇందులో మాజీ సర్పంచ్ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి, రేపాక నాగయ్య గుర్రాల దండి ఆంజనేయులు దుంప అంజనేయులు తదితరులు ఉన్నారు.