ఓయో రూమ్ బుక్ చేసే ముందు.. పక్కా ఇవి తెలుసుకోవాలి..!

-

చాలామంది ఓయో రూమ్స్ ని బుక్ చేసుకుంటూ ఉంటారు. ఓయో రూమ్స్ బుక్ చేసుకునేటప్పుడు కొన్ని విషయాలను చూసుకోవాలి. ఓయో హోటల్లో ప్రజలు సురక్షితంగా ఉన్నారని వాళ్ళు చెప్తున్నప్పటికీ మనం ఓయో రూమ్స్ ని తనిఖీ చేసుకోవడం ముఖ్యం. ఓయో గదులను భారత దేశంలో యువత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఓయో గదులకి అద్దె తక్కువ ఉంటుంది. పైగా సురక్షితంగా ఉంటాయని నమ్మకంతో చాలా మంది ఓయో రూమ్స్ లో స్టే చేస్తూ ఉంటారు. దీనిని 2012లో రిటేష్ అగర్వాల్ స్థాపించారు.

80 దేశాల్లో 800 కు పైగా నగరాల్లో ఓయో కార్యకలాపాలని నిర్వహిస్తోంది. 10 లక్షలకు పైగా గదులు ఉన్నాయట. అయితే ఈ గదులు సురక్షితంగానే ఉంటాయని ఓయో చెప్తున్నా తనిఖీ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా సరే ఏదైనా హోటల్లో స్టే చేసే ముందు మీరు అన్ని లైట్లు ఆపేయండి. మొబైల్ ఫోన్ కెమెరాతో అన్ని ప్రదేశాలని కూడా చెక్ చేయండి. హిడెన్ కెమెరాస్ వంటివి వాటిలో పెట్టే అవకాశం ఉంటుంది.

కాబట్టి వెతకడం చాలా ముఖ్యం. మీరు లైట్లు ఆపేసి వెతికినప్పుడు రెడ్ లైట్ కనబడితే జాగ్రత్తగా ఉండాలి. అలాగే లైట్స్, హీటర్స్, టీవీ వంటి విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా చెక్ చేయండి. గదిలో ఎక్కడైనా మిర్రర్స్ వంటివి ఉంటే కూడా చెక్ చేయండి. అవతల ఎవరైనా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ మిర్రర్ ని కూడా ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. పోలీసులు ఓయోలో రిజిస్టర్ చేసుకున్న హోటల్స్ ని ఎలాంటి వారెంట్లు లేకుండా తనకి చేయలేరు 18 ఏళ్లు దాటితే మిమ్మల్ని ఎవరూ అరెస్ట్ చేయలేరు అని గుర్తుపెట్టుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news