కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు.. తరువాత ఇస్తున్న హామీలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో అనేక నూతన హామీలు ఇస్తున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. కనీసం అ సంక్షేమ పథకాలు ఉన్నాయా లేదా అని కూడా చెప్పడం లేదు. గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. అమలుకు సాధ్యం కానీ హామీలు ఇస్తుంది కాంగ్రెస్. కర్ణాటకలో దివాళా తీసే పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. తెలంగాణ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది.
తెలంగాణలో హామీలు అమలు చేయకుండా బుకాయిస్తున్నారు. నిరుద్యోగ యువత ఆకలి కేకలని పోలీసుల లాఠీలతో అణచివేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంపద పెంచే పనులు చేయడం లేదు. తెలంగాణ ఆర్ధిక పరిస్థితి దివాళా తీసింది. పంటలకి ఇస్తామన్న బోనస్ ఇవ్వడం లేదు. రెండు లక్షల రుణమాపి పూర్తి స్థాయిలో చేయలేదు. రైతు బరోసా ఎక్కడకి పోయిందో తెలియదు. కాంగ్రెస్ పార్టీ లో ప్రచారం ఫుల్.. పనులు నిల్ అని కిషన్ రెడ్డి ఆరోపించారు.