పెళ్లి అంటే ఇద్దరు మనుషులు ఒకటవడమే కాదు. రెండు కుటుంబాలు కూడా ఒకటవుతాయి. హిందూమతంలో పెళ్లి సమయంలో మనుషులే కాకుండా దేవుడు కూడా పెళ్లికి సాక్షిగా ఉంటారట. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల్ని దగ్గర చేసి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. నిజానికి పెళ్లి అనేది ఒక కొత్త జీవితం అని చెప్పొచ్చు. హిందూ ధర్మం లో 16 ఆచారాలలో పెళ్లి ఒకటి. పెళ్లి చేసుకోవడాన్ని ఎంతో శుభ పరిణామంగా భావిస్తారు. హిందూ మతంలో పెళ్లి సమయంలో ఏడు అడుగులు వేస్తారు. అసలు పెళ్లిలో ఏడు అడుగులు ఎందుకు వేయాలి..? దాని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
ఏడు అడుగుల్లో మొదటి నాలుగు అడుగులని వరుడు ముందు వేసేలా చూడడం జరుగుతుంది. ఆ తర్వాత మూడు అడుగులు వధువు నడుస్తుంది. హిందూ మతంలో ఏడు దశలు పెళ్లి స్థిరత్వానికి ప్రధాన స్తంభంగా భావిస్తారు. ఏడు అనే సంఖ్యకి ప్రాధాన్యత కూడా ఎక్కువ ఉంటుంది. మానవ శరీరంలో శక్తి యొక్క ఏడు కేంద్రాలు ఉంటాయి. పెళ్లి సమయంలో వధూవరులు ఏడు అడుగులు వేయడం జరుగుతుంది.
శక్తిని ఒకరికొకరు అంకితం చేస్తామని ప్రామిస్ చేస్తారు. ఏడు జన్మల పాటు కలిసి ఉంటామని చెప్తారు కనుక పెళ్లి సమయంలో ఏడు అడుగులు వేయడం జరుగుతుంది. మొదటిది అన్న వృద్దికి, రెండవది బలవృద్దికి, మూడవది ధన ప్రాప్తికి, నాలుగవది దంపతులిద్దరూ సుఖంగా ఉండడానికి, ఐదవది ఒకరికొకరు చేతనైన మేరకు సహాయం చేస్తామని, ఆరవది పెళ్లి జీవితంలో ఏ కలహాలు, అనుమానాలు లేకుండా ఉంటామని.. ఏడవది సంతానం కోసం వేస్తారు.