ప్రజల ఆస్తులను లాక్కొని.. తమ సొంత ఆస్తిలా భావించి జగన్ కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం, చెన్నాయపాలెంలోని సరస్వతి పవర్ భూములను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామని భావిస్తున్నారని.. ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు పవన్ కళ్యాణ్.
2009లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సరస్వతీ పవర్ ప్లాంట్ కోసం 30 ఏళ్లు లీజుకు తీసుకున్నారు. జగన్ సీఎం అయిన తరువాత 50 ఏళ్లు పొడగించుకున్నారని తెలిపారు. ఆ రోజు నుంచి ఇవాళ్టి వరకు ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదన్నారు. గతంలో నాటు బాంబులు వేసి భయపెట్టారు. సరస్వతీ పవర్ కింద ఎంత భూమి ఉంది.. ఇందులో ఎలాంటి అవకతవకలు జరిగాయనే దానిపై విచారణ చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎస్సీల వద్ద 24 ఎకరాలు ఆక్రమించుకున్నారు. భూములు ఇచ్చిన రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు పవన్ కళ్యాణ్.