పత్తి కొనుగోలు పై మంత్రి తుమ్మల కీలక సూచన

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే రైతులు పత్తిని అమ్ముకోవాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. ఇవాళ ఆయన మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఉదయ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి సేకరణకు సీసీఐ అధికారులు 105 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

నోటిఫై చేసిన ప్రతి జిన్నింగ్ మిల్లు పని చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. తేమ శాతం సడలింపు పై సీసీఐ సీఎండీ తో కూడా మాట్లాడామని పేర్కొన్నారు. పత్తి కొనుగోళ్లలో ఏమైనా ఇబ్బందులుంటే రైతులు వాట్సాప్ నెంబర్ 8897281111 కు సంప్రదించాలని స్పష్టం చేశారు. సమస్యలపై కలెక్టర్లు, మార్కెటింగ్ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news