రాష్ట్రంలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే గత వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఏపీ ఛాంబర్ ఆధ్వర్యంలో వజవాడలో ఇవాల బిజినెస్ ఎక్స్ పో కార్యక్రమం నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకోకపోవడంతో చాలా పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెల్లిపోయాయని తెలిపారు.
ఈ తరుణంలోనే వేలాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు అని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పరిశ్రమల ఏర్పాటు పై ప్రత్యేక విధానాలను అమలు చేస్తుందని మంత్రి కొండపల్లి తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు కు ప్రభుత్వ రంగ పరంగా అన్ని విధాల సహకారాన్ని అందిస్తామని చెప్పారు. చిన్న తరహా సహా పరిశ్రమల ఏర్పాటు వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ పరంగా చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా బ్యాంకు నుంచి రుణాలను కూడా అందజేస్తున్నామని తెలిపారు.