ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షులు ఎవరు..? పురందేశ్వరిని కొనసాగిస్తారా..? పార్టీలో జరుగుతున్న ఇంటర్నల్ చర్చ ఇదే..

-

ఆంధ్రప్రదేశ్లో బలమైన శక్తిగా ఎదగాలని చూస్తున్న కమలం పార్టీ.. చాప కింద నీరులా తమ వ్యూహాలకు పదును పెడుతోంది.. కూటమిలో భాగస్వామిగా ఉన్న బిజెపి సొంతంగా ఎదగాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.. అందులో భాగంగా చేపట్టిన బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం గ్రామ గ్రామాన నిర్వహిస్తోంది.. సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిన వెంటనే బిజెపి అధ్యక్షుని మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతుంది.. బూత్ స్థాయి నుంచి మండల రాష్ట్ర స్థాయి వరకు అధ్యక్ష ఎన్నికలు ఉంటాయి.. భారతీయ జనతా పార్టీ మూడేళ్లకు ఒకసారి అధ్యక్షులను మారుస్తూ ఉంటుంది.. అయితే సమర్థతను బట్టి రెండోసారి కూడా అధ్యక్షులు కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.. దీంతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరిని కొనసాగిస్తారా లేదా తప్పిస్తారా అనే చర్చ కమలం పార్టీలో జరుగుతుంది.

ఏపీ అధ్యక్షురాలుగా పురందేశ్వరి బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కావస్తోంది.. కమ్మ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న పురందేశ్వరి.. పార్టీ నీ బలోపేతం చేయడంలో సక్సెస్ అయ్యారు.. గతంలో కంటే ఓట్లు సీట్లు కూడా పెరిగాయి.. రాష్ట్ర విభజన తర్వాత నలుగురు బలమైన నేతలు అధ్యక్ష పదవిని సమర్థవంతంగా నిర్వర్తించారు.. హరిబాబు దగ్గర్నుంచి సోము వీర్రాజు కన్నా లక్ష్మీనారాయణ లాంటి నేతలు బిజెపి బలోపేతం కోసం వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు.. అదే ఒరవడిని పురందేశ్వరి కూడా కొనసాగించి.. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని ఆమె బలోపేతం చేశారు.. ఈ క్రమంలో టిడిపి తో పొత్తు పెట్టుకుని 8 అసెంబ్లీ స్థానాలతో పాటు మూడు ఎంపీ స్థానాలను గెలిచి.. ఏపీలో కమలం పార్టీ సత్తా ఏంటో చూపించారు.. ఈ క్రమంలోనే ఏపీలో బలోపేతం అయ్యేందుకు ఆ పార్టీ గ్రౌండ్ వర్క్ చేస్తోంది..

పార్టీలో సంస్థాగత ఎన్నికల హడావుడి జరుగుతున్న వేళ పురందేశ్వరిని తప్పిస్తే ఎవరికి అవకాశం వస్తుందని దానిపై పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకే అధ్యక్ష బాధ్యతలు కేటాయిస్తూ వచ్చింది బిజెపి అగ్ర నాయకత్వం.. ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు కట్టబెట్టాలని చూస్తుందట.. వైసీపీ ఓట్లను కూడా కొల్లగొట్టాలంటే బలమైన రెడ్డి నేతను దగ్గరికి తీసుకోవాలని చూస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తుంది.. అందులో భాగంగానే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి , విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతల పేర్లను అధిష్టానం పరిశీలిస్తుందని కమలం పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి..

రాయలసీమ జిల్లాకు చెందిన నేతకు బాధ్యతలు అప్పగించి.. వైసీపీనీ దెబ్బ కొట్టాలని బిజెపి చూస్తోందట.. పురందేశ్వరికి జాతీయస్థాయిలో కీలక పదవి అప్పగించి.. ఆస్థానాన్ని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు అప్పగించాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.. నవంబర్ 15 తర్వాత ఏపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారని దానిపై స్పష్టత రానుంది..

Read more RELATED
Recommended to you

Latest news