అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. డెమోక్రటిక్ అభ్యర్థిని కమలా హ్యారిస్ ఓటమి పాలైంది. విజయం సాధించిన ట్రంప్ నకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా పోస్టు చేశారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇండో-యూఎస్ భాగస్వామ్యం గణనీయంగా బలోపేతమైంది.
ప్రధాని నరేంద్ర మోడీ, ట్రంప్ నాయకత్వంలో రెండు దేశాల సంబంధాలు మరింత బలపడాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా.. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం 79 ఏళ్ల వయస్సు ఉన్న ట్రంప్.. అమెరికా అధ్యక్ష పదవీని చేపట్టడం ఇది రెండో సారి. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ విజయం సాధించారు. ఇప్పుడు కూడా డెమోక్రటిక్ పార్టీ మహిళా అభ్యర్థి కమలా హ్యారిస్ పై గెలుపొందారు ట్రంప్. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు కూడా ఆంధ్రప్రదేశ్ అల్లుడే కావడం విశేషం.