సోషల్ మీడియాలో అసత్య పోస్టులను ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ మంత్రి వర్గ సమావేశం ముగిసిన తరువాత రాజకీయ అంశాలపై అమాత్యులతో చంద్రబాబు చర్చించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న సోషల్ మీడియా ప్రచారం పై సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రభుత్వాన్ని కించపరిచే పోస్టులపై ఉదాసీనత తగదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలుత ప్రస్తావించినట్టు తెలిసింది.
అసభ్య, అవాస్తవ పోస్టులపై ఫిర్యాదులు వస్తున్నా.. కొందరూ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నట్టు సమాచారం. జగన్ ప్రభుత్వంలో క్రియాశీలంగా వ్యవహరించిన కొందరూ అధికారులే ఇప్పుడూ కీలక పదవుల్లో ఉన్నారనే అంశం చర్చకు వచ్చింది. కొంతమంది అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పలు జిల్లాల ఎస్పీలు మంత్రుల ఫోన్లకు డీఎస్పీ, సీఐలపై నెపంనెట్టి తప్పించుకుంటున్నారని మంత్రులు చంద్రబాబుకు తెలిపారు.