ఆర్ & బీ అధికారుల పని తీరుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం..!

-

ఆర్ & బీ రివ్యూలో అధికారుల పని తీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. నిద్రమత్తు వీడి రోడ్ల రిపేర్లు చేయాలన్నారు మంత్రి. వర్షాలకు రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రిపేర్లు చేయకుండా మీనమేషాలు లెక్కించడం ఏంటి అని ప్రశ్నించారు. మాటలు కాదు.. రిజల్ట్ కావాలి. మీరేమో ప్రతీ రివ్యూలో రోడ్లు బావున్నాయని చెబుతారు. ప్రజలు రోడ్లు బాలేవంటున్నారు. అసలు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారా అని స్టేట్ రోడ్స్ అధికారులపై సీరియస్ అయ్యారు మంత్రి.

అలాగే ప్యాచ్ వర్క్ లు చేయడానికి ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది అని ప్రశ్నించిన మంత్రి.. మనం ప్రజల కోసం పనిచేస్తున్నామన్న స్పృహ ఉండాలి. పార్ట్ హోల్స్ నింపకుండా ఏం చేస్తున్నారు అని అడిగిన కోమటిరెడ్డి.. ప్రతీవారం రివ్యూ చేయండని స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రెటరీ శ్రీమతి దాసరి హరిచందనకు ఆదేశాలు జారీ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news