ఏపీ, తెలంగాణకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంత తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో రేపు లేదా ఎల్లుండి లోపు అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
దీనికి తోడు ఈశాన్య రుతుపవనాలు బలపడి రాష్ట్రంలో రానున్న మరో 4 రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. శని, ఆదివారాల్లో పలు ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురుస్తాయన్నారు. అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఇక తెలంగాణకు కూడా వర్షాలు ఉంటాయని చెబుతున్నారు అధికారులు.