చలి కాలం మొదలైంది. దీంతో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమ క్రమంగా పెరుగుతోంది. దీపావళి పండుగ నుంచే తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమ క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
ప్రస్తుతం అయితే.. తెలంగాణ రాష్ట్రంలో యావరేజ్ లో 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో… ఇంత కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉందట. ఇక అటు ఏపీ, తెలంగాణకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంత తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతం లో రేపు లేదా ఎల్లుండి లోపు అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.