కులగణన లక్ష్యమేంటో సర్కారుకే తెలీదు : ఎమ్మెల్యే రాజాసింగ్

-

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కులగణన లక్ష్యమేంటో కూడా సర్కారుకే తెలీదని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.గురువారం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకల జనుల సర్వే పేరుతో హడావుడి చేశారని, ఇప్పటివరకు ఆ వివరాలను పబ్లిక్ డొమెయిన్‌లో పెట్టలేదని గుర్తుచేశారు.

 

అలాంటప్పుడు ఆ సర్వే నిర్వహించి, అంతపెద్దమొత్తంలో డబ్బులు ఖర్చుచేసి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. అదేవిధంగా రాష్ట్రంలో కులగణన సర్వే రిపోర్టును ప్రభుత్వం ఖచ్చితంగా ఢిల్లీకే పంపుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పించుకునేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు. సీఎం రేవంత్ పాలనలో రాష్ట్ర అభివృద్ది శూన్యమని రాజాసింగ్ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news