ఏపీలోని కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ నేత జోగి రమేశ్ ప్రభుత్వంలోని కీలక నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ‘జగనన్న మాట ప్రకారం 2019లో సీటు త్యాగం చేసి పక్కకి వెళ్లాను. మా మోచేతి కింద నీళ్ళు తాగి, మా జెండా గుర్తుపై గెలిచి ఇప్పుడు కూటమితో జతకట్టి మా జగనన్నపై కారుకూతలు కూస్తార్రా?..బకాయిలన్నీ తీసుకుని జంప్ జిలానీ అయ్యారు.నేను వైయస్ రాజశేఖర రెడ్డి శిష్యుడిని..
నా జోలికి వస్తారనుకున్నా.. నాకుటుంబంలో నా కుమారుడిపైన కూడా కక్ష సాధింపులకు దిగుతున్నారు .నా జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు, అడగకుండా పెట్టేవాడే జగనన్న.. ఎన్ని కేసులు పెట్టినా బెదిరే వ్యక్తి కాదు ఈ జోగి రమేష్..
ఈ రోజు నుండి ప్రయాణం మొదలైంది, జనవరిలో మైలవరంలో వైసీపీ కార్యాలయం ప్రారంభిస్తాం.. మాకు కూటములు లేవు, జెండాలు జతకట్టాల్సిన అవసరం లేదు, ఒక్కడే లీడర్, సింగిల్ ఎజెండా .. 5 నెలలు కూడా పూర్తి కాకుండానే ఎందుకు కూటమి ప్రభుత్వానికి ఓటు వేశామా? అని బాధపడుతూ జగనన్న కోసం చూస్తున్నారు జనం.. 2027లోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయి, మీరు సిద్దమేనా?’ అని ప్రశ్నించారు.