బంగారం రేటు పతనం అవుతోంది..రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ట్రంప్ విజయంతో బంగారం రేటు పతనం అవుతోందట. నవంబర్ 1న 2780 డాలర్లకు వెళ్లింది బంగారం ధర.. ప్రస్తుతం 2660 డాలర్లకు పడిపోయింది బంగారం ధర. ఒక్కరోజులో 100 డాలర్లు పడిపోయింది బంగారం ధర.. ఇకపై బంగారం ధర మరింత తగ్గుతుందంటున్నారు నిపుణులు.
ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెం డి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1790 తగ్గి రూ. 78, 560 గా నమోదు కాగా… అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1650 తగ్గి రూ. 72, 000 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీం తో కేజీ వెండి రూ. 1000 తగ్గి రూ. 1,04,900 గా నమోదు అయింది.