తెలంగాణ పలువురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అందిన రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా మార్చింది. కానీ ఇప్పటి వరకు అది ఇవ్వలేదు. అలాగే పలు పంటలను కొనకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ – బోథ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కుచులాపూర్‌కు చెందిన రైతు ఎడ్మల మోహన్ రెడ్డి దాదాపు 30 క్వింటాళ్ల సోయా పంటను నాలుగు రోజుల కిందట మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు.
మార్కెట్ యార్డులో ఎన్ని రోజులైనా సోయా పంట కొనడం లేదని.. అవేదనతో మోహన్ రెడ్డి అనే రైతు పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇవాళ కూడా కొనుగోలు చేపట్టకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా తాను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని, సోయా సంచులు చోరీకి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని ఏఎంసీ ఛైర్మన్ గంగారెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా తీసి తాగేందుకు ప్రయత్నించారు. సహచర రైతులు అప్రమత్తమై వెంటనే అడ్డుకున్నారు.