ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని సోషల్ మీడియా కార్యకర్తల పై అక్రమంగా కేసులు పెట్టారు. వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టినా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది . కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నోటీసులిచ్చి.. అరెస్టులు చేస్తున్నారు అని పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రశ్నించే గొంతుక ఉండకూడదని అక్రమంగా కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు . తప్పుడు కేసులను ప్రోత్సహించొద్దని పోలీసులను కోరుతున్నాం. కేసుల పేరుతో పూటకో స్టేషన్ మార్చి చిత్రహింసలకు గురిచేస్తున్నారు . ప్రశ్నించే గొంతుకను అణచివేస్తే తిరగబడే రోజు కచ్చితంగా వస్తుంది అని వెలంపల్లి తెలిపారు.
అదే విధంగా aవైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది తిరువూరులో ఇద్దరు స్టూడెంట్ల పై అక్రమంగా కేసులు పెట్టారు. దివ్యాంగులైన వారిని కూడా వదలడం లేదు. సోషల్ మీడియా సైనికులను కేసులతో భయపెట్టలేరు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైసీపీ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం తప్పిదాలను ఎండగడతాం అని అన్నారు.