శ్రీకాళహస్తిలో అఘోరి దర్శన వివాదం సుఖాంతమైంది. స్వామీ, అమ్మవార్లు దర్శించుకుంది అఘోరి. అయితే గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రలో చర్చల్లో ఉన్న మహిళ అఘోరి.. నిన్న శ్రీకాళహస్తికి వెళ్ళింది. కానీ ఆమెను ఆలయ సిబ్బంది లోపలికి వెళ్లనివ్వలేదు. దాంతో కాసేపు అక్కడ అధికారులతో వాగ్విదానికి దిగిన అఘోరి.. ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ ఆలయ అధికారులు ఆమెపై నీళ్లు పోసి ఎటువంటి దుర్ఘటన జరగకుండా ఆపారు. ఆ తర్వాత శ్రీకాళహస్తి పోలీసులు ఆమెను తీసుకెళ్లి తమిళనాడు బోర్డర్ లో వదిలేసారు.
కానీ ఈరోజు మళ్ళీ శ్రీకాళహస్తిజూ వచ్చిన అఘోరిని ఎస్పీ సుబ్బారాయుడు చొరవతో దర్శనానికి అనుమతించారు ఆలయ అధికారులు. వస్త్రాలు ధరించి స్వామీ. అమ్మవారిని దర్శించుకున్న అఘోరి.. నిన్న కాళహస్తీశ్వర ఆలయంలోకి వెళ్ళే సమయంలో బట్టలు లేకుండా వెళ్ళడానికి వీలులేదని చెప్పడం ఆత్మహత్య యత్నించి భక్తులను భయబ్రాంతులకు గురి చేసింది. కానీ ఈరోజు ఆలయ అధికారులతో ఎస్పీ చర్చించి దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు.