లేడీ అఘోరీకి యాక్సిడెంట్‌..వీడియో వైరల్‌ !

-

లేడీ అఘోరీకి పెను ప్రమాదం చోటు చేసుకుంది. లేడీ అఘోరీకి కారు యాక్సిడెంట్ కు గురైంది. ఈ సంఘటన గురు వారం రోజున రాత్రి జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన నాగసాధు అఘోరీ కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు శ్రీకాళహస్తి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.

Aghori Met Car Accident While Returning from Srikalahasthi

దీనిపై అఘోరీ స్పందిస్తూ.. తనకు ఏమి కాలేదని, తాను క్షేమంగానే ఉన్నానని తెలిపింది. వీధిలైట్లు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. అయితే అఘోరీ కారు డివైడర్ ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. కాగా… నిన్న ఉదయం శ్రీకాళహస్తిలో నగ్నంగా ఆలయంలోకి దర్శనానికి వెళ్లడానికి ప్రయత్నించిన మహిళా అఘోరిని…ఆలయ సిబ్బంది అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత.. ఎర్ర గుడ్డ కట్టుకుని.. ఆలయంలోకి దర్శనానికి వెళ్లింది.

Read more RELATED
Recommended to you

Latest news