జగన్ క్యాంప్ కార్యాలయ ఫర్నీచర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ క్యాంప్ కార్యాలయ ఫర్నీచర్ వ్యవహారంపై ఏపీ హై కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జగన్ క్యాంప్ కార్యాలయ ఫర్నీచర్ వ్యవహారంలో వైసీపీ వేసిన పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ చేసింది. ఫర్నీచర్ తీసుకువెళ్లాలని GAD కి లేఖ రాసినా స్పందించటం లేదని వైసీపీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఫర్నీచర్ తీసుకు వెళ్ళకపోతే ఫర్నీచర్ ధర ఎంతో చెబితే చెల్లిస్తామని చెప్పినా GAD స్పందించటం లేదని పిటిషన్ వేసింది వైసీపీ పార్టీ. అయితే… ఈ కేసును ఇవాళ హై కోర్టు విచారణ చేసింది. వైసీపీ వేసిన పిటిషన్ పై ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉంటే క్లారిటీగా తెలపాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇక జగన్ క్యాంప్ కార్యాలయ ఫర్నీచర్ వ్యవహారం కేసు తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.