సుప్రీంకోర్టులో కే.ఏ.పాల్ కు షాక్.. పిటిషన్ డిస్మిస్

-

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ కు సుప్రీంకోర్టులో షాక్ తగిలిందనే చెప్పాలి. తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలంటూ సుప్రీం కోర్టులో కే.ఏ.పాల్ పిటిషన్ వేశారు. ఆయన వేసిన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. జస్టీస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్న పాల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఉన్నత న్యాయ స్థానం వ్యాఖ్యానిస్తూ.. ఈ పిటిషన్ ను కొట్టివేసింది.

సుప్రీం కోర్టు తీర్పు పై పాల్ స్పందిస్తూ.. ” నా పిటిషన్ విచారించినందుకు కృతజ్ఞతలు” అని తెలిపారు. తన పిటిషన్ కు కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారన్నారు. కోట్లాది మంది హిందువులకు సంబంధించిన అంశానికి సమయం ఇవ్వలేదు. మత పరమైన స్వేచ్ఛకు తిరుమలలో విఘాతం కలుగుతోంది. హిందూ ఆలయాలను హిందూ అర్చకులు, పూజారులే నిర్వహించుకోవాలని తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్లు వారి మసీదులు, చర్చిలను వారే నిర్వహించుకుంటున్నారు. మరోసారి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయనున్నట్టు వెల్లడించారు. 

Read more RELATED
Recommended to you

Latest news