ఐదు నెలలు.. ప్రజా స్వామ్యంగా పరిపాలన చేస్తున్నాం. తప్పు చేసిన వారి పై లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నాం. చంద్రబాబు, పవన్ కుటుంబం పై ఇష్టానుసారం పోస్ట్ చేస్తున్నారు. పవన్ తన ఆడపిల్లలపై అసబ్యకరంగా పోస్టులు పెడుతున్నారని.. క్యాబినెట్ బేటిలో బాధపడ్డారు. దోంగే దోంగ అన్నట్లుగా జగన్ గొంతు చించుకుని అరుస్తున్నారు. ఈ రోజు భావ ప్రకటనా స్వేచ్చా గుర్తోచ్చిందా జగన్.. తప్పు చేస్తే విమర్శించు. కానీ భావ ప్రకటనా స్వేచ్చ పేరుతో.. ఆడపిల్లలపై ఇష్టానుసారం పెడతారా అని ప్రశ్నించారు.
అసలు నువ్వు మనిషి పుట్టుక పుట్టావా.. జన్మనిచ్చిన సొంత తల్లి, చెల్లి మీద సోషల్ మీడియాలో పెడుతున్నారు. నిన్ను మనిషి అనుకోవాలా. మళ్ళీ మహిళలపై అసహ్యకరమైన పోస్టులు పెడితే… అది మీకు చివరి రోజు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున హెచ్చరిస్తున్నా మహిళలు ఎవరిపైనైనా ఏ పార్టీ వారైనా అసహ్య పోస్టులు పెడితే సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. తప్పు చేసినవారిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నాం అని మంత్రి మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.