అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇంటి బయట భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆయనకు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అమెరికా సీక్రెట్ ఏజెన్సీ సీఐఏ ఆయనకు భద్రతను పెంచింది.అమెరికా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయనపై రెండు సార్లు హత్యాయత్నం జరగగా.. తృటిలో తప్పించుకుని అధ్యక్షుడిగా విజయం సాధించారు. జనవరి 20న ఆయన అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేయనున్నారు.
ఈ క్రమంలోనే ఆయనకు మరింత భద్రతను పెంచారు. ఫ్లోరిడాలోని ఆయన నివాసం వద్ద రోబో డాగ్స్ ను మోహరించారు. వాటిపై ‘DO NOT PET’ అని రాసి ఉంది. రిమోట్‌తో ఆపరేట్ చేసే ఈ రోబోల్లో సర్వైలెన్స్ టెక్నాలజీ, ఆధునాతన సెన్సార్లు, ఉంటాయి. కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ సైతం చేపడతాయని సీఐఏ ఏజెన్సీ పేర్కొంది. వీటికి తోడు ఆయన ఇంటి చుట్టూ 24/7 రక్షణ కల్పించేలా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.