ఇంట్లో మొక్కలు పెంచాలనుకుంటున్నారా.. ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి.

-

మొక్కల్ని పెంచే వారికి అవి ఎండిపోతే విపరీతమైన బాధ ఉంటుంది. మొక్కలు పెంచడం అనేది చిన్న విషయం కాదు, అలా అని అది మహా కష్టమైన పని కూడా కాదు. కొంచెం ఓపిక, కొంచెం పట్టుదల అంటే మీ ఇంట్లో అందమైన మొక్కల్ని పెంచుకోవచ్చు.

కొత్తగా ఇంట్లో గార్డెన్ ని పెంచాలనుకునేవారు కొన్ని టిప్స్ ఫాలో అయితే గార్డెనింగ్ అనేది ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ టిప్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

డైలీ చూసే ప్రదేశాన్ని ఎంచుకోండి:

మీరు ఎక్కడ గార్డెన్ ని తయారు చేయాలనుకుంటున్నారనేది చాలా ముఖ్యం. డైలీ మీరు చూసే ప్రదేశంలో మొక్కలను పెంచండి. అలా అయితే అవి ఎలా ఉన్నాయో మీకు అర్థమై వాటికోసం ఏం చేయాలో తెలుసుకుంటారు.

ఎండ చాలా అవసరం:

మొక్కలు పెరగాలంటే ఎండ కావాలని అందరికీ తెలుసు. అలా అని మధ్యాహ్నం పూట రెండు గంటలు ఎండ వచ్చే ప్రదేశాన్ని మొక్కలు పెంచుకోవడానికి ఎంచుకోకూడదు. ఒక రోజులో ఎక్కువ శాతం ఎండ ఎక్కడైతే పడుతుందో ఆ ప్రదేశాన్ని ఎంచుకుంటే మొక్కలు బాగా పెరుగుతాయి.

మట్టి కుండలు ఉపయోగించండి:

మొక్కల్ని పెంచేందుకు మట్టితో తయారైన కుండల్ని ఉపయోగిస్తే ఆ ప్రదేశం దాని సహజత్వాన్ని కోల్పోకుండా ఉంటుంది. ప్లాస్టిక్ డబ్బాల్లో కూడా పెరుగుతాయి కాని సహజత్వం కుండల్లో పెంచిన వాటికి వస్తుంది. ఇంకో విషయం.. మీరు దేనిలో పెంచినా కూడా.. వాటి అడుగుభాగంలో నీళ్లు పోయే విధంగా చిన్న రంధ్రం ఉండేలా చూసుకోండి.

మేలు రకమైన మట్టి:

మొక్కలు పెంచుమన్నారు కదా అని ఏదో ఒక రకమైన మట్టిలో పెంచాలనుకుంటే పొరపాటు అవుతుంది. మీరు ఎంచుకునే మట్టి మంచి పోషకాలు కలిగినదై ఉండాలి. అలా అయితే మొక్క తొందరగా పెరిగి మీకు మంచి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

నీళ్లు, ఎరువులు:

కొన్ని మొక్కలు ఎరువులు లేకుండా పెరుగుతాయి, కొన్నింటికి మాత్రం కచ్చితంగా ఎరువులు కావాలి. నీళ్ళైతే తప్పనిసరి అని మీకు అందరికీ తెలుసు. ఏ మొక్కలకు ఎరువులు అవసరమవుతాయో తెలుసుకుంటే.. అందంగా గార్డెన్ ని తయారు చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news