ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. కేటీఆర్ సిరిసిల్ల నేతన్నల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే ఆయనను రాజీనామా చేయాలని మేము కోరలేదు. నేతన్నలు అధైర్యపడవద్దు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. కేటీఆర్ ఎమ్మెల్యే గా, నేను ఎంపీగా ఉన్న సమయంలో చేనేత సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసాం అని పొన్నం తెలిపారు.
ఇక వికారాబాద్ కలెక్టర్ పై దాడి చేయడం బాధకరం అని పేర్కొన పొన్నం.. కావాలని కలెక్టర్ ని తప్పుదోవ పట్టించి దాడి చేసారు. కలెక్టర్ పై దాడి చేయ్యడం ప్రజాస్వామ్యామా.. ప్రజాస్వామ్య పద్దతిలో, న్యాయవ్యవస్థ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించునట్లు ఉంది. సర్వేకి వచ్చిన అధికారులకి సమాచార సేకరణలో అడ్డంకులు సృష్టిస్తే చర్యలు తప్పవు. కావాలని బీఆర్ఎస్, బిజేపి సర్వే ని తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ రే లాగ సర్వే చేస్తుంది. సర్వేలో అభ్యంతకర అంశాలు ఉంటే చెప్పకండి అని పొన్నం పేర్కొన్నారు.