వర్రా రవీంద్రరెడ్డి రిమాండ్ రిపోర్ట్ రిలీజ్ చేసిన పోలీసులు..!

-

వర్రా రవీంద్రరెడ్డి రిమాండ్ రిపోర్ట్ రిలీజ్ చేసారు పోలీసులు. అందులో రెండు వర్గాలమద్య విభేదాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియా లో పోస్టులు పెట్టిన వర్రా.. ఎస్సి సామాజిక వర్గానికి చెందిన వారిని మానసికంగా హింసించేలా పోస్టులు పెట్టాడు అని పేర్కొన్నారు. అలాగే వర్రా రవీంద్రరెడ్డికి క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉంది. సజ్జల భార్గవ రెడ్డి , అర్జున్ రెడ్డిలతో కలిసి రవీంద్రరెడ్డి వైసిపి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ప్రధానంగా ఎస్సి కమ్యునిటీ లీడర్లనే టార్గెట్ చేశారు. మందా కృష్ణ మాదిగ , వంగలపూడి అనితల కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టారు.

మాదిగ సామాజిక వర్గ నేతలపై పెట్టిన పోస్టులు తొలగించాలంటూ వర్రా రవీంద్రను కోరాడు హరి అనే వ్యక్తి. కులంపేరుతో దూషిస్తూ రెండు లక్షలు ఇస్తే తొలగిస్తానన్నాడు వర్రా.. ఒప్పందంలో భాగంగా మందా కృష్ణ మాదిగ , వంగలపూడి అనితలపై అసభ్య కర పోస్టులు తొలగించేందుకు 20వేలు వర్రాకు ఇచ్చాడు హరి. డబ్బు తీసుకున్న తరువాత కూడా సజ్జల భార్గవ్ రెడ్డి , అర్జున్ రెడ్డిల సహకారంతో వైసిపి సోషల్ మీడియాలో మరింత అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారంటూ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు పోలీసులు. మహిళలు , చిన్నపిల్లలను టార్గెట్ గా చేసుకుని అసభ్యకర పోస్టులు పెట్టేవారు . ప్రస్తుత ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసే వారు అని రిమాండ్ నోటీస్ లో పేర్కొన్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news