ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అధికార కూటమి-ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. నిత్యం ఏదో ఒక టాపిక్ పై వాదనలు-ప్రతివాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఏపీ మాజీ మంత్రి విడుదల రజిని, ఆమె PAలపై పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు పిల్లి కోటి, టీడీపీ శ్రేణులు.
రామకృష్ణ, ఫణీంద్ర, అప్పటి చిలకలూరిపేట సీఐ సూర్యనారాయణ లపై ఎస్పీకి ఫిర్యాదు చేసారు బాధితుడైన పిల్లి కోటి, చిలకలూరిపేట కి చెందిన పలువురు టీడీపీ శ్రేణులు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమను దారుణంగా వేదించి తీవ్రంగా కొట్టారని ఫిర్యాదు చేశాడు బాధితుడు. కొట్టి చిత్రహింసలకు గురి చేసిన ఆ దృశ్యాలను లైవ్ లో చూస్తూ.. నాటి స్థానిక శాసనసభ్యురాలు, మాజీ మంత్రి అయిన విడదల రజనీ పైశాచిక ఆనందం పొందారని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తే చంపేస్తామని బెదిరించారు. విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఎస్పీ శ్రీనివాసరావుని కోరారు బాధితులు.