ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో శ్రీలంక కాబోతుందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. తాజాగా తాడెపల్లి క్యాంపు కార్యాలయంలో బడ్జెట్ పై ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దిన వైసీపీ ప్రభుత్వానికి పిలిచి అవార్డు ఇవ్వాలన్నారు. ఎవరి పాలనలో ఏపీ శ్రీలంక మాదిరిగా తయారైందని ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థను మా హయాంలోనే చక్కదిద్దామన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి అప్పులు రాకూడదని ఏజెన్సీలకు లేఖలు రాశారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని క్రియేట్ చేశారు. రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లుగా మొదలుపెట్టి ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి రూ.14 లక్షల కోట్లకు పెంచారు. రూ.10 లక్షల కోట్లు అప్పులు ఉన్నట్లు గవర్నర్తో కూడా అబద్ధాలు చెప్పించారు. ఓ పద్ధతి ప్రకారం మాపై గోబెల్స్ ప్రచారం చేశారు. బడ్జెట్ ప్రవేశపెడితే సూపర్ సిక్స్ హామీలకు నిధులు కేటాయించాల్సి వస్తుందని.. ఇన్ని రోజుల తరువాత బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆర్థిక సంవత్సరానికి 4 నెలల సమయం ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టడం చూస్తుంటేనే స్పష్టంగా అర్థమవుతుందన్నారు.