Work : మనసులో విషం నింపుకున్న ఆఫీస్ కొలీగ్స్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..?

-

ఆఫీసు, ఇల్లు.. మనుషులు ఎక్కువగా సమయాన్ని గడిపేది ఈ రెండు ప్రదేశాల్లోనే. కాబట్టి ఈ రెండు చోట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు, ఆఫీసులో కొలీగ్స్, సీనియర్లు, మేనేజర్లు ఉంటారు.

అయితే కొలీగ్స్ తో రిలేషన్ ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనసులో విషం నింపుకున్న కొలీగ్స్ మీ చుట్టూనే ఉంటారు. వాళ్లని ఎలా గుర్తుపట్టాలో, వాళ్లకుండే లక్షణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

గాసిప్:

మనసులో విషం నింపుకున్న కొలీగ్స్ ఎక్కువగా గాసిప్స్ స్ప్రెడ్ చేస్తుంటారు. వాళ్లు అలా అంట, వీళ్ళు ఇలానంట అని వాళ్లే అంటారు. ఒకవేళ మీరు దానికి వత్తాసు పలికితే.. మీ మాటల్ని వాళ్లే వెళ్లి అవతలి వాళ్లకు చెబుతారు. ఇతరుల గురించి చెప్పే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి.

నెగెటివ్ ఆలోచనలు:

ఎప్పుడూ నెగెటివ్ గా ఆలోచించేవారు ఏదైనా పని వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలని కాకుండా దానివల్ల జరిగే నష్టాలను భూతద్దం పెట్టి మరి చూపించి టీం ని భయపడతారు.

వెటకారం, చులకన భావం:

మనసులో విషం నింపుకున్న కొలీగ్స్ ఇతరులతో వెటకారంగా మాట్లాడతారు. అంతేకాదు వాళ్లకు అవతలి వాళ్ళంటే చులకన భావం ఉంటుంది. వాళ్ల మాటల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది.

కంట్రోల్ చేసే అలవాటు:

మీరు ఒక పని చేస్తుంటే.. దాని మధ్యలోకి వచ్చేసి ప్రతి దాని గురించి గుచ్చి గుచ్చి చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ల వల్ల మీలోని క్రియేటివిటీ పోతుంది. మీరు చేసే పనిని వాళ్లు కంట్రోల్ చేసి ఇబ్బంది పెడతారు.

అవతలి వారి మీద నిందలు:

చాలా సులభంగా ఎదుటివారి మీద నిందలను వేసేస్తుంటారు. పక్కనున్న వాళ్లను బ్లేమ్ చేసేందుకు ఈజీగా రెడీ అయిపోతారు.

ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లు మీ చుట్టూరా ఉంటే జాగ్రత్తగా ఉండటం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news