మానవ శరీరంలో అతి పెద్ద గ్రంధి కాలేయం. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించడంలో, జీర్ణక్రియకు సహాయపడటంలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అయితే కొన్ని డ్రింక్స్ తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాంటి డ్రింక్స్ లో ఆల్కహాల్ ఒకటని అందరికీ తెలుసు.
అతి ఎక్కువగా ఆల్కహాల్ సేవించడం వల్ల కాలేయం పాడవుతుంది. అయితే కేవలం ఆల్కహాల్ మాత్రమే కాలేయాన్ని పాడు చేస్తుందా..? లేదా ఇతర డ్రింక్స్ కూడా కాలేయం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయా అంటే… అవుననే చెప్పాలి.
ప్రస్తుతం ఆల్కహాల్ మాత్రమే కాకుండా కాలేయం ఆరోగ్యాన్ని పాడు చేసే ఇతర డ్రింక్స్ గురించి తెలుసుకుందాం.
ఎనర్జీ డ్రింక్స్:
ఉన్నపలంగా శరీరానికి శక్తిని అందించే ఎనర్జీ డ్రింక్స్ లో టారిన్, కెఫిన్ వంటి హానికారక రసాయనాలు ఎక్కువ డోసేజ్ లో ఉంటాయి. ఆ కారణంగా కాలేయం దెబ్బతింటుంది.
కూల్ డ్రింక్స్:
సాధారణంగా సిట్టింగుల్లో మందు తాగకుండా కూల్ డ్రింక్స్ తాగుతుంటారు కొంతమంది. శరీరానికి మందు ఎంత హానికరమో కూల్ డ్రింక్స్ కూడా అంతే హానికరం. కూల్ డ్రింక్స్ లో చక్కెర అధికంగా ఉంటుంది. అది కూడా ద్రవరూపంలో ఉంటుంది. ఈ చక్కెర కారణంగా కాలేయం దెబ్బతింటుంది.
సోడా:
సోడాలో ఉండే హానికారగా రసాయన పదార్థాలు కాలేయంలో పేరుకుపోయి, కాలేయాన్ని పని చేయకుండా తయారుచేస్తాయి. అందుకే సోడా కి కూడా దూరంగా ఉండండి.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.