నైట్ షిఫ్టుల్లో వర్క్ చేస్తున్నారా..? ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే పాటించాల్సిన కొన్ని నియమాలు

-

గ్లోబలైజేషన్ కారణంగా నైట్ షిఫ్ట్ అనేది ప్రస్తుతం సాధారణం అయిపోయింది. కానీ నైట్ టైం వర్క్ చేయడం అనేది సాధారణం మాత్రం కాదు. దానివల్ల అనేక అనారోగ్యాలు వస్తాయి. శరీర జీవక్రియ దెబ్బతినడంతో పాటు అనేక చెడు అలవాట్లు అలవడుతాయి.

ప్రస్తుతం నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో, ఏ విధంగా ఉంటే ఆరోగ్యం పాడవకుండా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

నిద్ర ముఖ్యం:

నైట్ షిఫ్ట్ పనిచేసే వారు ఉదయం నుండి సాయంత్రం వరకు పడుకుంటారు. కానీ రాత్రి నిద్ర పట్టినట్టుగా గాఢ నిద్ర అసలు పట్టదు. కాబట్టి మీ గదిలో లైట్లు అన్నింటిని ఆర్పి వేసి, రాత్రి ఎలా ఉంటుందో అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయండి. కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోండి. ఇంకో విషయం.. నిద్ర పోవడానికి రెండు గంటల ముందు కాఫీ, టీ అస్సలు తాగవద్దు. ప్రతిరోజు ఒకే టైం కి నిద్రపోండి.

డైట్:

రాత్రుళ్ళు పనిచేస్తారు కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోవాలి. హై ప్రోటీన్, ఎక్కువ ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకుని చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను దూరం పెట్టండి. ఎక్సర్సైజ్ మరువద్దు, అలానే విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవద్దు.

రొటీన్ లైఫ్ స్టైల్:

నైట్ షిఫ్ట్ చేసేటప్పుడు మీ లైఫ్ స్టైల్ లో మార్పులను అస్సలు తీసుకురాకూడదు. డైలీ ఏ టైంకి తింటారో ఆ టైంకి తినాలి. ఏ టైం కి పడుకుంటారో ఆ టైంకి పడుకోవాలి. వాటిల్లో ఏమైనా తేడా వస్తే దాని ప్రభావం మీ నిద్ర మీద పడుతుంది. నిద్ర సరిగ్గా లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది.

మానసిక ఆరోగ్యం:

నైట్ షిఫ్ట్ పని చేయడం వల్ల మానసికంగా చాలా ప్రభావం పడుతుంది. దాని నుండి మీరు బయటపడాలంటే.. నలుగురిని కలవటం, స్నేహితులతో మాట్లాడటం వంటివి చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news