ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి రాదంటూ బాంబ్ పేల్చారు సీఎం చంద్రబాబు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాదు..చెత్త పై పన్ను తొలగించామన్నారు. వైస్సార్సీపీ గుంతలు చేసి పోతే పూడ్చే పని మేము చేస్తున్నామని.. 55 వేల కోట్లు నేషనల్ హైవే కి కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. 10 శాతం మద్యం షాపులను గీత కార్మికులకు కేటాయించిన ప్రభుత్వం మాదే అన్నారు. ఇవాళ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ… పాలసీలతో పాలనను ఒక దారికి 1995లో తీసుకొచ్చామని.. దాని ఫలితంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళుతుందని చెప్పారు.
నూతన ఆర్ధిక వ్యవస్ధకు దోహదం చేసామన్నారు. ఒక్క లిటిగేషన్ లేకుండా ల్యాండ్ పూలింగ్ లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అమరావతి భూములు వచ్చాయని తెలిపారు. అన్ని వ్యవస్ధలను నాశనం చేసారు… ఆస్తవ్యస్ధ ఆర్ధిక నిర్వహణలో రాష్ట్రం పరిస్ధితి వెనక్కి పోయిందని ఆగ్రహించారు. ఏపీ జీవనాడి పోలవరం పనులు పూర్తి చేస్తే ఈ రాష్ట్రానికి కరువనేది రాదు..విద్యుత్ బకాయిలు పెట్టి ఓపెన్ మార్కెట్ లో విద్యుత్ కొనాలని చూసారన్నారు. 1.29లక్షల కోట్ల నష్టంలోకి విద్యుత్ శాఖను నెట్టేసారని ఆరోపణలు చేశారు చంద్రబాబు.