కేసీఆర్ ను కేటీఆర్ నిర్భందించారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ నేతల పాత్ర ఉందని వాళ్లు చెబితేనే తెలుస్తోందన్నారు. కలెక్టర్ పై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. పోలీసుల విచారణలో త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయని.. ఎవ్వరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
తప్పు చేసిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టదు. అసలు కేసీఆర్ ఎందుకు బయటికి రావడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు చూస్తుంటే హాస్యమేస్తుందని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో త్వరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలుంటాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ పై ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని తెలిపారు. తనకు, రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలున్నాయని తెలిపారు. రేపటి నుంచి తాను జిల్లాల పర్యటన చేస్తానని.. అందులో భాగంగా ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని తెలిపారు.