బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముమ్మాటికీ అవకతవకలు జరిగాయని.. బాధ్యులపై చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు సోషల్ మీడియాను మితిమీరి వినియోగిస్తూ.. ప్రభుత్వం పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారందరూ విదేశాలలో ఉంటూ ఇలా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏడాదిగా అసలు బయటికీ రావడం లేదన్నారు.
ప్రజాస్వామ్య పద్దతిలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటే.. బీఆర్ఎస్ కి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా వచ్చారు. వారిని మేము ప్రలోభపెట్టి తీసుకోలేదు. హైడ్రా అనేది హైదరాబాద్ నగరానికి ఒక వరం అని పేర్కొన్నారు. ఆక్రమణలకు గురైన చెరువులు, కాలువలను పూర్తిగా బాగు చేస్తే.. వయనాడ్ లో చోటు చేసుకున్న పరిస్థితి ఇక్కడ వచ్చే అవకాశం ఉండదు అన్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.