ఇంతకీ యోగ ప్రాక్టీస్ చేస్తున్నావా? అంటూ టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ పై సెటైర్లు వేశారు. ఈ మేరకు శనివారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ. ‘పదేళ్లలో మూసీల మరింత విషం నింపి రోగాలకు కేరాఫ్ అడ్రస్ చేసినోడు.. దొరికినకాడికి మూసీని కబ్జాలు చేసిన బీఆర్ఎస్ దొంగలను కాపాడినోడు, నోట్లో నుంచి మూసీ శుద్ధి తప్ప చెయ్యాలనే బుద్ధి లేనోడు మూసీ గురించి మాట్లాడబట్టే.. గాంధీ విగ్రహం పెడుతారంటేనే కడుపులో అక్కసు కక్కే నీలాంటి విష నాగులే అసలైన గాడ్సే వారసులు కేటీఆర్, నువ్వు, నీ అయ్య ఏనాడూ గాంధీజీని అనుసరించిందీ లేదు.
బతికుంటే మూసీ ప్రక్షాళనకు గాంధీజీ నేడు ముందుంటుండే’ అని పేర్కొన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని కొల్లగొట్టి.. నాడు దేశాన్ని కొల్లగొట్టిన తెల్ల దొరలను తలపించిన బందిపోటు ముఠా మీరని విమర్శించారు. మీ నోటి నుంచి గాంధీజీ పేరు పలికినా ఆయన ఆత్మ చింతిస్తుందని తెలిపారు. 1100 కోట్లకే మూసీ పునరుజ్జీవం చేసేటట్టుంటే పదేళ్లు నువ్వు నీ అయ్య ఏం చేశారు? నువ్వు నీ బక్వాస్ మాటలు.. అంటూ తీవ్ర విమర్శలు చేశారు.