కాళేశ్వరంతో సంబంధం లేకుండా రికార్డు స్థాయి వరి ధాన్యం పండిందంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందంటూ చురకలు అంటించారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి… నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా…
ఎన్డీఎస్ఎ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలోనీటిని నిల్వ చేయకపోయినా… కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందని ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది తెలంగాణ రైతుల ఘనత అన్నారు. వారి శ్రమ, చెమట, కష్టం ఫలితం అని వివరించారు… తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం అన్నారు…ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు అంటూ వ్యాఖ్యానించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది.
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి… నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా…
ఎన్డీఎస్ఎ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలోనీటిని నిల్వ చేయకపోయినా…
కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత… pic.twitter.com/7FXH4v2ZMq— Revanth Reddy (@revanth_anumula) November 17, 2024